అందం ఎవరికీ చేదు, అందం కోసం ఏమి చేయమన్నా చేసేస్తాం, పస్తులు ఉండమన్నా ఉంటాం. మొత్తానికి అందం మాత్రం సొంతం అవ్వాలి. అయితే ఎలా అది సాధ్యం అవుతుంది. లేని అందాన్ని ఎక్కడి నుంచీ తెచ్చి పెట్టుకుంటాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమే కానీ కొన్ని కొన్ని సహజ సిద్ద పద్దతుల ద్వారా గగ్గురు గగ్గురుగా ఉండే ముఖ చర్మం లేలేతగా, సున్నితంగా తయారవుతుంది. అయితే క్రమం తప్పకుండా ఈ పద్దతులని పాటిస్తే తప్పకుండా మీలో మార్పుని గమనిస్తారు.

 Image result for sandalwood with milk

అందుకు కావాల్సింది ఒక గంధం చెక్క ,గంధం చెక్కని సాన పట్టే ఓ సాన, మూడు పాలు. ఈ మూడు మీ ఇంట్లో ఉంటే తప్పకుండా మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు అనడంలో సందేహం లేదు. మరి ఈ మూడు పదార్ధాలతో సౌందర్య సాధనం ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

 Image result for sandalwood piece

మేలిమి రాయితో చేసిన సానాలు మార్కెట్ లో లభ్యం అవుతుంటాయి. వీటిని సాన రాళ్ళు అంటారు. వీటిపై గంధం, సొంటి , ఇలాంటి వాటిని సానపెట్టి దాని ద్వారా వచ్చే మెత్తటి గుజ్జులాంటి పదార్ధాన్ని వాడుతారు. ఇక గంధం చెక్క నకిలీ చెక్క కాకుండా మంచి గంధం చెక్కని తీసుకుని ఒక గ్లాసు ఆవు పాలు కూడా తీసుకుని ఉంచుకోవాలి.ముందుగా సానపై రెండు మూడు చుక్కల పాలు పోసి , గంధం చెక్కని సానపై పాలు పోసిన ప్రదేశంలో అరగదీస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు చూర్నంలా వచ్చిన గంధం ఆరిపోకుండా పాలు పోస్తూ ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పల్చగా చర్మం కనిపించకుండా పట్టించాలి.ఆ తరువాత ఒక రెండు మూడు గంటల తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుబ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చాలు తప్పకుండా చర్మం లేతగా, సున్నితంగా తయారవుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: