మన శరీర చర్మంతో పోలిస్తే ముఖ చర్మం చాలా ఎక్స్పోజ్ అవుతా ఉంటది.దీని వలనే మన ముఖం పైన డస్ట్,డెడ్ సెల్స్,ట్యాన్ వంటివి ఎక్కువగా ఏర్పడతాయి.దీనికి పరిష్కారం మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లో రోజు వాడే పథార్ధాలతోనే ఎంతో ఈజీగా మన ముఖాన్ని అందంగా ఉంచుకోవచ్చు.


  దీనికి కావాల్సిన పథార్ధాలు:
 టమాటా1
పంచదారకొద్దిగా
సెనగపిండికొద్దిగ
టమాటా గుజ్జు2 టేబుల్ స్పూన్ లు
అలోవేరా జెల్కొద్దిగ
  తేనెకొద్దిగ
ముందుగా మనం టమాటాను సగానికి కట్ చేసుకోవాలి.ఇలా కట్ చేసిన టమాటాను పంచదారలో అద్ది దానిని మన ముఖానికి రుద్దుకుని ఒక 5 నిమిషాలపాటు మర్ధనా చేసుకోవాలి. ఇలా చెయడం వల్ల మన చర్మ రంధ్రాలు బాగా సుభ్రపరుస్తాయి. ఇలా రుద్దుకున్న ఒక 10 నిమిషాల తరవాత ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి
  ఇలా టమాటా ,పంచదారతో ముఖాన్ని స్క్రబ్ చెసుకున్న తరవాత ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.ఫేస్ ప్యాక్ వేసుకోటం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది.  
 ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే విధానం:


ఒక చిన్న గిన్నెలో కొద్దిగ సెనగపిండి,అలోవేరా జెల్,టమాటా గుజ్జు రెండు టేబుల్ స్పూన్ లు,తేన కొద్దిగ వేసుకోని చిక్కటి పేస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి.ఇల్లా కలిపిన మిశ్రమాన్ని మనం ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా ఈ విదంగా చేయడం వల్ల ముఖం మీద నలుపు,మృతకణాలు,ట్యాన్ అన్ని కూడా తొలిగిపోయి ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.
బియ్యంతో కూడా మన ముఖం ఎంతో తెల్లగా మారుతుందని మీకు తెలుసా.ఎలా అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం.బియ్యంలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ లు అదికంగా ఉండటం వల్ల ముఖం మీద ఉన్న డెడ్ సెల్స్ ని,మృతకణాలని తగిస్తుంది.ఈ రెమిడీని కొరియన్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే వాళ్ళు ఎంతో అందంగా ఉంటారు.     


దీనికి కావాల్సిన పధార్ధాలు, తయారి విదానం ఎలానో ఇప్పుడూ చూద్దాం :
బియ్యం-కొద్దిగ        
 సెనగపప్పు-కొద్దిగ  
       నువ్వులు-కొద్దిగ    
     తేన-కొద్దిగ       
   బాదం పప్పు-4

ముందుగా బియ్యాన్ని ఒక చిన్న గిన్నెలో నానబెట్టాలి,అలాగే దాంట్లో కొంచెం సెనగపప్పు,ఒక టేబుల్ స్పూన్ నువ్వులు,కొంచెం తేనె,బాదం పప్పు నాలుగు అన్నీ కలిపి సుభ్రంగా కడుక్కోని,మరి కొన్ని నీళ్ళుపోసి వాటిని రెండు గంటలు నానబెట్టాలి.అవి నానాకా బాదం పప్పు తోలును తీసి నానబెటిన వాటిని మెతగా పేస్ట్ లాగా చేసుకోవాలి.


తరవాత ఈ పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోని దాంట్లో కొంచం తేనె పోసి బాగా కలుపుకొవాలి.ఇలా కలిపిన తరువాత మన ముఖానికి అప్లై చేసేముందు ముఖాన్ని, మెడను సుభ్రంగా కడుక్కోవాలి.ఆ తరువాత ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి రెండు నిమిషాలు బాగా మర్ధనా చేయాలి.ఇది మంచి స్క్రబ్ లాగా బాగా పనిచేస్తుంది.ఈ ప్యాక్ పూర్తిగా ఆరిపొయాక చల్లని నీళ్ళతో కడుక్కోవాలి. 



 ఈ ప్యాక్ కేవలం ముఖం పైనే కాదు మెడమీద కూడా అప్లై చేసుకోవచు.ఈ విదంగా వారానికి రెండు,మూడు రోజులు చేస్తే ముఖం మీద ఉండే నల్ల మచ్చలు,మృతకణాలు,ట్యాన్ మరియు లార్జ్ పోర్స్ తొలగిపొతాయి. మెడమీద ఉండే నలుపు కూడా తగ్గిపోతుంది.ఈ ప్యాక్ ను ఫ్రిడ్జ్ లో పెట్టి మూడు,నాలుగు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: