అందాన్ని ఎప్పటికప్పుడు పదిలంగా ఉంచుకోవాలంటే ముందు చర్మాన్ని ఎంతో శుభ్రంగా ఉంచాలి. చర్మ సౌదర్యం తోనే మన అందం రెట్టింపు అవుతుంది. మరి అలాంటప్పుడు చర్మ సంరక్షణకై  మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇపుడు చూద్దాం. సహజంగా చర్మం ప్రస్తుత కాలుష్య ప్రపంచంలో త్వరగా పాడవుతోంది. కాలుష్యం కారణంగా చర్మపై ఉండే రంధ్రాలు మూసుకుపోయి చర్మంపై మొటిమలు రావడం, చర్మం ఎప్పుడూ జిడ్డుగా మారడం, ఎర్రబడటం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి.

 Related image

ఈ కారణంగా మీ ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. జిడ్డుగా చర్మం ఉండటం వలన మనం ఎన్నో సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకున్నా సరే మళ్ళీ కొద్ది నిమిషాలలోనే చర్మం జిడ్డుగా మారుతుంది. ఈ పరిస్థితుల నుంచీ బయట పడాలంటే “ఐస్ క్యూబ్స్” ఎంతగానో ఉపయోగ పడుతాయి. జ్యూస్ లలో, సోడాలో కలుపుకునే ఐస్ క్యూబ్స్ ఇలా కూడా ఉపయోగ పడుతాయా అనుకుంటున్నారు కదా అవును నిజమే ఐస్ క్యూబ్స్ చర్మానికి ఎలాంటి మేలుచేస్తాయో ఇప్పుడు చూద్దాం.

 Image result for ice cube for pimple

ఐస్ క్యూబ్ కి చర్మాన్ని బిగుతుగా చేసే గొప్ప గుణం ఉంది. అంతేకాదు ముడతలు పడిన చర్మాన్ని తెరుచుకునేలా చేయగల సామర్ధ్యం కూడా వీటికి ఉంది.రక్త ప్రసరణ సరిగా చేయడంలో కూడా ఐస్ క్యూబ్స్ ఎంతో కీలకంగా పనిచేస్తాయి. ముందుగా ఐస్ ముక్కలని కొన్నిటిని ఒక గుడ్డలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాగా సాగిపోయిన లేదా చర్మ రంధ్రాలు మూసుకుపోయిన ప్రాంతంలో బాగా రుద్దాలి.

 Related image

ఈ విధంగా చేయడం వలన ముడుచుకుపోయిన చర్మం యదాస్థానానికి వస్తుంది.అంతేకాదు..రంధ్రాలలో ఉన్న ధూళి తొలగిపోయి చర్మ చర్మ నునుపుగా మారుతుంది.మొటిమలు భాదపెడుతూ ఎర్రగా మారుతుంటే ఐస్ క్యూబ్స్ తో వాటిపై రుద్దడం వలన నొప్పి తగ్గడమే కాకుండా ఎరుపు రంగుకూడా పోతుంది. ఇంకెందుకు ఆలస్యం మొటిమలు ఉన్న వారు, చర్మం వదులుగా ఉన్నవారు ఈ చిట్కాని పాటించి ఫలితాలని పొందండి.


మరింత సమాచారం తెలుసుకోండి: