స‌హ‌జంగా మొటిమలతో చాలా మంది బాధ‌ప‌డుతుంటారు. బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మొటిమ‌ల‌ నుంచి బయటపడడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వేలకు వేలు వెచ్చించి ఖరీదైన క్రీములు కొనుగోలు చేస్తారు. అయినాసరే ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చర్మం పాడవుతుంది. అందుకని మొటిమల సమస్యకు ఇంట్లోనే సహజ పదార్థాలతో చిన్న చిన్న చిట్కాలను పాటించడం మేలు. 


దీని వల్ల మొటిమలు తగ్గుతాయి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. దీంతో పాటు ముఖం సహజ కాంతిని పొందుతుంది. ఈ క్ర‌మంలోనే నిమ్మ మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. నిమ్మరసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన చర్మం కింద ఉండే మొటిమలను నిరోధించడానికి సహాయప‌డుతుంది. నిమ్మ‌ను అనేక ర‌కాలుగు ఉప‌యోగించి మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


- నిమ్మ స‌రంలో శెన‌గ‌పిండి క‌లిపి ముఖానికి రాసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.


- ఫేస్‌కు నిమ్మరసం అప్లై చేసి కొంత స‌మయం అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.


- పెరుగులో నిమ్మ ర‌సాన్ని వేసి మిక్స్ చేసి ముఖానికి పూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌లినాలు, మొట‌మ‌లు తొల‌గిస్తుంది.


- రోజూ గ్లాసుడు నిమ్మరసం కలిపి నీళ్లు తాగాలి. నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల అవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. 


- నిమ్మ‌ర‌సంలో కొద్దిగా తేనె క‌లిసి మొటిమ‌ల ఉన్న చోట రాసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.


- ఆరెంజ్ తొక్క‌ల పొడిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం యాడ్ చేసి ముఖానికి రాసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: