బొప్పాయి ఆరోగ్యానికి మంచిద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. బొప్పాయిలో ఉన్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, బీ, సీ, డీ లు పుష్క‌లంగా ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాదు. చర్మ సౌందర్యానికీ వినియోగించుకోవచ్చు. ఇంటి వద్దే పార్లర్ వంటి నిగారింపును పొందవచ్చు. మరెందుకు ఆలస్యం దీంతో ఎలాంటి పాక్స్ తయారు చేసుకోవచ్చునో తెలుసుకుందాం..


- టమాటా గుజ్జు, నారింజ గుజ్జు, బొప్పాయి గుజ్జు, కొద్దిగా రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.


- అనుకోకుండా అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళే  ప్రోగ్రామ్ ఉంటే బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్ క్లీన్ చేసుకోవ‌డం వ‌ల్ల ముఖంలో నిగారింపు సంతరించుకుంటుంది.


- బొప్పాయి, తేనె, పాలు కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి కొంత సమయం తర్వాత వాష్ చేసుకోవ‌డం వ‌ల్ల మ‌లినాలు తొల‌గి కాంతివంతంగా మారుతుంది.


- బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం వేసి ముఖానికి పట్టించండి. కొంత స‌మ‌యం తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.


- బాదం పేస్ట్, చిటికెడు పసుపు, బొప్పాయి పేస్ట్ కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం అందంగా మెరుస్తుంది.


- బొప్పాయి గుజ్జుతో పాటు శ‌నగపిండిని కూడా కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకుని ఉన్న జిడ్డు తొల‌గుతుంది.


- బొప్పాయి గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం, కొంచెం తేనె వేసి క‌ళ్ళ కింద బాగా మసాజ్ చేస్తే కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలు త్వరగా తొలగుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: