సాధార‌ణంగా ఏవైనా ఫంక్ష‌న్ల‌కు మహిళల అలంకరణ ప్రాధాన్యాల్లో గోరింటాకుది ప్రత్యేకమైన స్థానం. మ‌రియు అట్లతద్ది వంటి పండుగలకు గోరింటాకు పెట్టుకోవటం తెలుగు నేల ఆనవాయితీ. చిన్నశుభకార్యం మొదలు పండగలూ, పెళ్ళిళ్ళ వరకు మహిళలు గోరింటాకు పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతారు. గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని పెద్ద‌లు అంటుంటారు. అయితే గోరింటాకు మంచి క‌ల‌ర్ రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే స‌రిపోతుంది. అవేంటో ఓ లుక్కేయండి.


- నిమ్మరసంలో పంచదార వేసి సిరఫ్ లా తయారు చేసుకోవాలి. మెహింది చేతులకు పెట్టుకొన్న తర్వాత తడి ఆరేసమయంలో ఈ లెమన్ సుగర్ సిరఫ్ ను చేతులకు అప్లై చేయాలి. దీని వ‌ల్ల మెహిందీ మంచి క‌ల‌ర్ వ‌స్తుంది.


- గోరింటాకు పండిన తర్వాత నేరుగా నీళ్ళు పోసి కడకుండా.. ఎండిన హెన్నాను నెమ్మదిగా తొలగించాలి. ఆ త‌ర్వాత చేతుల‌కు కొబ్బ‌రి నూనె రాసుకుంటే మంచి క‌ల‌ర్ వ‌స్తుంది.


- గోరింటాకు చేతులకు పెట్టుకొన్న తర్వాత అది చేతుల మీద కనీసం ఐదు నిమిషాల పాటు ఉండేలా  చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి క‌ల‌ర్ పొంద‌వ‌చ్చు.


- మెహిందీలో ముందు కొద్దిగా పుదీనా పేస్ట్ లేదా పుదీనా నూనె వేసి పెట్టుకుంటే కూడా మంచి క‌ల‌ర్ వస్తుంది.


- మెహిందీ పెట్టుకున్న‌ చేతుల‌పై నిమ్మ‌ర‌సాన్ని అప్లై చేస్తూ ఉండాలి.  మెహిందీ ఆరుతున్న స‌మ‌యంలో ఇలా చేయ‌డం వ‌ల్ల ఎర్ర రంగులో పండుతుంది.


- చేతికి గోరింటాకును తీసిన త‌ర్వాత ల‌వంగాల‌ను ప్యాన్‌లో వేసి వేడిచేయాలి. అలా వ‌చ్చే ఆవిరిని చేతుల‌కు ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మెహిందీ మంచి రంగు వ‌స్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: