సహజంగా భోజనం చేసే ముందు కానీ, టిఫిన్ తినే సమయం ముందుగానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటారు. కానీ చాలా మంది ఈ పద్దతిని పాటించకుండానే మురికి పట్టిన చేతులతోనే అన్నీ లోపలి తోసేస్తూ ఉంటారు. ఫలితంగా అనేక రకాల రోగాల బారిన పడటం ఎన్నో ఇబ్బందులపాలవడం మనకి తెలిసినదే. అయితే గతంలో చెతులు శుభ్రం చేసుకుని తినడంపై పెద్దగా అవగాహన లేకపోయినా ప్రస్తుత కాలంలో అందరూ ఈ పద్దతిని తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే రకరకాల హ్యాండ్ వాష్ లు అందుబాటులోకి వచ్చేశాయి.

 

మార్కెట్ లో లభించే సువాసన వెదజల్లే హ్యాండ్ వాష్ లు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఇలా చేతులు శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడుగానీ లేక ఇంట్లోనే హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఇబ్బంది పడుతారు. ఒంటి సబ్భుతో చాలా మంది శుభ్రం చేసుకోరు. అలాంటి వారు వంటింట్లో దొరకే కొన్ని పదార్ధాలతో హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు.

 

ఇంట్లో హ్యాండ్ వాష్ లేనపుడు కొంచం ఉప్పు తీసుకుని మంచి నీటిలో వేసి బాగా కలిపి ఆ నీటితో చేతులు శుభ్రం చేసుకోవచ్చు. అలాగే కొన్ని లవంగాలు తీసుకుని వాటిని మంచి నీటిలో వేసి వేడి చేసి ఆ నీటితో చేతులు శుభ్రం చేసుకోవచ్చు లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియ గుణాలు మీ చేతులని ఎంతో శుభ్రంగా ఉంచుతాయి.అలాగే నిమ్మ కాయ అందుబాటులో ఉంటే  గనుకా చాకుతో రెండు ముక్కలుగా చేసి ఒక చెక్కతో చేతిని శుభ్రంగా రుద్ది శుభ్రపరుచుకోవచ్చు. ఈ పద్దతులని పాటించడం ద్వారా చేతులు శుభ్రంగా మారడమే కాదు ఎంతో మృదువుగా అందంగా కూడా మారుతాయి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: