చాలా మందికి శరీరం కాంతివంతంగా మెరుస్తూ ఎంతో మేలిమి చాయని కలిగి ఉంటుంది. అదే వ్యకులలో చాల మందికి మోకాళ్ళు మోచేతులు నల్లగా మారి అందవిహీనంగా కనిపిస్తాయి. చివరికి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే నల్లగా మారే ప్రదేశాలని దాచుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఆ నలుపు పోగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. తెలిసినవి తెలియనివి ఏవోవో క్రీములు రాస్తూ అసలుకే ఎసరు తెచ్చుకుంటారు. అలాంటి వారు ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్ లేని ఇంట్లో దొరికే వారితోనే కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. మరి ఆ వంటింటి చిట్కాలు ఏంటో ఒక సారి పరిశీలిద్దాం.

 

నిమ్మకాయలు , రోజ్ వాటర్ ఈ రెండిటిని ఉపయోగించి నలుపుదనం పోగొట్టవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయ  రసాన్ని తీసుకుని అందులో కొంచం రోజ్ వాటర్ కలపాలి. ఒక్క ఐదు నిమిషాలు ఆగిన తరువాత ఆ మిశ్రమాన్ని నలుపు ఉన్న మోచేతులు, మోకాళ్ళకి రాసుకుంటే చక్కని ఫలితం పొందవచ్చు. అలాగే

 

పాలు , షోడా ఉప్పు ద్వారా కూడా ఈ నలుపుదనం పోగొట్టవచ్చు. ఒక గిన్నెలోకి కొన్ని పాలు తీసుకుని అందులో కొంచం బేకింగ్ షోడా వేసి ఆ మిశ్రమాన్ని నలుపుగా ఉన్న ప్రదేశాలలో రాయడం వలన నలుపుదనం పోవడమే కాకుండా ఎంతో మృదువుగా అవుతాయి.

 

అలాగే మంచి గంధం , కొబ్బరి నూనె , వంటి వాటిని కూడా నల్లగా మారిన మోచేతులు, మోకాళ్ళపై రాయడం వలన నలుపురంగు పోయి యధాస్థానానికి వస్తాయి.ఈ పద్దతులని పాటిస్తే సైడ్ ఎఫ్ఫెక్ట్ లు లేకుండా చర్మం పాడవకుండా కాపాడుకోవచ్చు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: