సాధార‌ణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించి చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెరిగిన కాలుష్యం, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కారణాలు ఏవైనా చాలామంది జుట్టురాలే సమస్యలను ఎదుర్కొంటారు. జుట్టు సమస్యలను నివారించుకోవడానికి చాలామంది రకరకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈసారి మీ జుట్టు సమస్యలను నివారించుకోవడానికి నూనెలు, షాంపూలు కాకుండా కేవలం వంటింట్లో ఉండే పుదీనా ఆకులను ప్రయత్నించండి.


ఇది జుట్టుకు కావల్సినంత బలాన్నిస్తుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. చుండ్రును పూర్తిగా తొలగించడానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, బలాన్ని పెంచడానికి, పుదీనా నూనెను తలకు రాసుకోవచ్చు. ఇది జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాపడుతుంది. పుదీనా ఆకులు పేస్ట్‌ లేదా పుదీనానూనెకు కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. ఈ మిశ్రమం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది.


పుదీనా నూనెను జుట్టు చివర్లకు రాసుకుంటే.. జుట్టు చివర్లు చిట్లకుండా చేయడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. తలకు పుదీనానూనె రాసుకోవడం వల్ల రక్తప్రసరణకు తోడ్పడి.. తలను చల్లగా ఉంచుతుంది. పుదీనానూనె జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు తలలో పేలు, చుండ్రును తొలగిస్తుంది. పుదీనా జుట్టుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: