రోజు రోజుకి జుట్టు ఊడిపోతోందని బెంగ పడిపోతున్న వాళ్ళ సంఖ్య అధికమవుతోంది. మనం చేస్తున్న తప్పిదాల వలనో, పెరుగుతున్న కాలుష్యం, కలుషితం అవుతున్న ఆహరం, నిత్య కృత్యం అవుతున్న ఒత్తిడి. ఇవన్నీ  జట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు. అయితే జుట్టు రాలు సమస్య నుంచీ తప్పించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. తూచా తప్పకుండా పాటిస్తే జుట్టు రాలు సమస్య దూరం అవుతుంది.

 

సహజంగా ఎన్నో చిట్కాలు అందుబాటులో ఉన్నా ఎవరికి పెద్దగా తెలియని చిట్కా ఏమిటంటే. అల్లం నూనె తో జుట్టు బద్రం చేసుకోవడం. వంటింట్లో మనం తినడానికి ఉపయోగించే అల్లం కేవలం ఆరోగ్య పరిరక్షణకే కాదు జుట్టు బలంగా మారడానికి కూడా ఎంతగానో ఉపయోగ పడుతుందనేది ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మరి ఈ అల్లం ఉపయోగించి జుట్టుని ఎలా ధృడంగా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

 

ఇంట్లో ఉండే అల్లం తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ చేసుకుని అందులోని రసాన్ని బయటకి తీయాలి. ఒక గిన్నెలోకి తీసుకున్న రసాన్ని అలాగే ఉంచి. వేళ్ళతో తలలోకి చొప్పించి  కుదుళ్ళకి బాగా పట్టించాలి. ఇలా చేయడం వలన అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్, పొటాషియం, పాస్పరస్ వంటి గుణాలు జుట్టు గట్టిపడేలా చేస్తాయి. దాంతో క్రమక్రంగా జుట్టు ధృడంగా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: