చలికాలం ఇంకా రాలేదు. ఇది వర్షాకాలం. కానీ చాల మాత్రం ఓ రేంజ్ లో పెట్టేస్తుంది. ఈ వాతావర్ణ మార్పుల వల్ల అందరూ తెగ ఇబ్బందులు పడుతున్నారు. అమ్మాయిలు అయితే చలి వల్ల మరి ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నట్టుంది చలి రావడం వల్ల మొఖ చర్మం చెప్పలేనంతగా పొడిబారిపోతోంది. దీంతో అమ్మాయిలు తెగ ఇబ్బంది పది లోషన్స్ మీద లోషన్స్ వాడుతున్నారు. అలాంటివి అన్ని ఎం అవసరం లేదు. కేవలం ఇక్కడ ఉన్న చిట్కాలు పాటిస్తే చాలు. మీ చర్మంపై మిల మిల మెరుస్తూ సాఫ్ట్ గా తయారవుతుంది. 


చెంచాడు చొప్పున అరటిపండు గుజ్జు, వెన్న లేదా మీగడ తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాయాలి. దీనివల్ల చర్మానికి సహజసిద్ధమైన తేమ అంది చర్మం పొడి బారదు.


చెంచా చొప్పున తేనె, రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. తేనె సహజ మాయిశ్చరైజర్‌గానూ, రోజ్‌వాటర్‌ చర్మాన్ని టోనర్ గా పనిచేసి చర్మం సున్నితంగా మారుస్తాయి.   


తేనె 2 చెంచాలు, 4 చెంచాల పెరుగు కలిపి ముఖానికి, మెడకు ప్యాక్‌ వేసి పావుగంట తరువాత చన్నీటితో కడిగితే పొడిబారిన చర్మం మెత్తబడుతుంది.


క్యారెట్‌ గుజ్జు 2 చెంచాలు, చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత కడిగేయాలి. 


ఉడికించిన బంగాళాదుంపని మెత్తగా మెదిపి అర చెంచా పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత నీటితో కడిగితే నల్లబడ్డ చర్మం అసలు రంగులోకి వస్తుంది. చూశారుగా ఈ చిట్కాలు పాటిస్తే ఎంత అందంగా తయారవుతారో. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాలను పాటించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: