సాధార‌ణంగా బేబీ ఆయిల్‌తో చిన్నారుల ఒంటికి మృదుత్వాన్ని, తేమని, రక్షణను అందించడానికి మర్దనా చేస్తాం. ఆ ఆయిల్‌ పిల్లలకే కాదు... పెద్దలకి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాస్త రేటు ఎక్కువైనప్పటికీ చాలా మంది బేబీ ఆయిల్‌తో పిల్లలకు మసాజ్ చేస్తున్నారంటే... కారణం దాని వల్ల కలిగే చక్కటి ప్రయోజనాలే. అయితే బేబీ ఆయిల్‌తో ప్ర‌తి ఒక్క‌రికీ బెనిఫిట్స్ ఉన్నాయి. బేబీ ఆయిల్ చ‌ర్మ ర‌క్ష‌ణ‌కు ఎంతో గ్రేట్‌గా ప‌ని చేస్తుంది. చాలా మందికి కంటికింద నల్లటి వలయాలు ఏర్పడ‌తాయి. అలాంటి వారు కొద్దిగా ఆయిల్‌ తో మర్దన చేసుకుని నిద్రపోవాలి. దీంతో నలుపు దనం తగ్గుముఖం పడుతుంది.


అలాగే కొంద‌రికి జుట్టు ఎండిపోయి గడ్డిలా ఉంటుంది. అలాంటి వారు జుట్టు మొత్తానికి బేబీ ఆయిల్ ను బాగా పట్టించాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే వెంట్రుకలు తేమవంతంగా మారతాయి. ముఖ్యంగా ముఖానికి తేమ సరిగా అందాలంటే ఈ నూనెని తరచూ రాయడం మంచిదే. కొన్ని చుక్కల బేబీ ఆయిల్ ను స్నానం చేసే నీటిలో లేదా మీ ఫెర్ఫ్యూమ్ లో మిక్స్ చేసి శరీరానికి స్ప్రే చేసుకోవడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటారు.


శీతాకాలంలో పొడిబారిన మరియు చీలిన చర్మానికి మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి స్నానానికి వెళ్ళే పది నిముషాల ముందు బేబీ ఆయిల్ ను బాడీకి అప్లై చేసి తర్వాత స్నానం చేస్తే మంచిది. వ్యాక్సింగ్‌ చేయించుకున్నాక దద్దుర్లు రాకుండా ఉండాలంటే  కొద్దిగా ఆ నూనె రాసి మర్దన చేస్తే చాలు. చర్మం సాంత్వన పొందుతుంది. మృదువుగానూ మారుతుంది. మేకప్ రిమూవర్‌గా కూడా బేబీ ఆయిల్‌ని చ‌క్క‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: