సాధార‌ణంగా పొడి చర్మం ఉన్న వారికి ఎటువంటి సమస్యలు ఉంటాయో, అలానే జిడ్డు చర్మం ఉన్న వారు కూడా చాలా రకాలా సమస్యలను ఎదుర్కొంటారు.  అయితే ఈ జిడ్డు చర్మం ఉన్నవారు ఎన్ని ఫేస్ క్రీమ్ లు వాడినా ప్రయోజనం మాత్రం శూన్యం. చర్మం నుండి అధిక జిడ్డు స్రవించడం వలన మొటిమల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన చర్మ తత్త్వం కలవారు సరైన చర్మ సంరక్షణ చేయకపోతే ముందు ముందు ఇంకా అనేక సమస్యలు వస్తాయి. అయితే ఎటువంటి దుష్ప్ర భావాలు లేనటువంటి సహజ మార్గాలలో జిడ్డు చర్మం వల్ల ఏర్పడే సమస్యల నుండి బయటపడవచ్చు. అవేంటో ఇప్ప‌డు తెలుసుకుందాం..


- జిడ్డు చర్మం ఉన్నవారు గంధం పొడిని, నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టేలా రాయాలి. 15 నిమిషాల త‌ర్వాత‌ చల్లని నీటితో వాష్ చేయాలి. రోజూ ఇలా చేయటం వల్ల చర్మం తాజాగా మారటంతో బాటు కళ్ళ కింది నల్లని చారలు, వలయాలు తొలగిపోతాయి.


- ఆరెంజ్ ర‌సాన్ని నేరుగా ముఖానికి అప్లై చేసి కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవాలి. ఆరెంజ్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య లక్షణాలను నిరోదించటానికి మరియు జిడ్డును తొలగించటానికి సహాయపడుతుంది.


- ఐస్‌ ముక్కని నేరుగా కాకుండా ఒక మెత్తటి కాటన్ క్లాత్‌తో ఉంచి ముఖం మీద రుద్దడం వలన జిడ్డు సమస్య నుండి బయట పడవచ్చు.


- జిడ్డు చర్మం ఉన్నవారు పాలతో ముఖం, మెడ భాగాలను శుభ్రంగా కడుక్కోవటం వల్ల అక్కడి మురికి అంతా తొలగి పోవటమే గాక ముఖం తాజాగా మారుతుంది.


-  నిమ్మరసంలో పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు  చనిపోయిన చర్మ కణాలను తొలగించటమే కాక అధికంగా ఉన్న నూనెను తొలగిస్తుంది.


- యాపిల్‌ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ జిడ్డును వదిలించడంతో పాటు మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: