సాధార‌ణంగా పంచ‌దార తెలియ‌ని వారుండ‌రు. దీన్ని చక్కెర అని కొందరంటే పంచదార అని కొందరంటారు. పంచదారను రోజులో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటాం. తియ్యని పంచదార వివిధ రకాల తినుబండరాలకు రుచిని అందిస్తుంది. అయితే పంచ‌దార ఆరోగ్యానికి ఎంత ఉప‌యోగ‌ప‌డుతుందో ప‌క్క‌న పెడితే.. అందానికి మాత్రం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చక్కెరలో యాంటీ ఏజింగ్ ఓ కారకంగా పని చేస్తుంది.


పంచదారలో నేచురల్ యాంటీఏజింగ్ గుణాలున్నాయి. షుగర్ స్ర్కబ్ మీ చర్మాన్ని శుభ్రం చేస్తుంది . చర్మ కణాలకు టాక్సిన్ చేరకుండా సహాయపడుతుంది . దీర్ఘకాలంలో వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా కాపాడి చర్మం యవ్వనంగా ఉండేలా సహాయపడుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంకెందుకు ఆల‌స్యం..  ఆ బ్యూటీ టిప్స్ ఏంటో ఓ లుక్కేస్తే పోలా..


- పంచ‌దార‌లో కొద్దిగా తేనె వేసి క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌పై సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెద‌వుల‌పై మృత క‌ణాలు తొల‌గి అందమైన రంగును సంత‌రించుకుంటాయి.


- చక్కెరలోఆలివ్ ఆయిల్‌ నూనెని, కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని కాసేపు రుద్దుకుంటే నలుపుదనం తగ్గుతుంది.


- చర్మం మృదువుగా మారాలంటే పంచదార‌లో కొబ్బరినూనె, రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని గాలి ప్రవేశించని డబ్బాలో పోసి కావలసినపుడల్లా ఒంటికి పట్టించి బాగా రుద్దండి. ఇలా చేయడంతో మృతకణాలు తొలగిపోయి చర్మం మెరిసిపోతాయి.


- షుగర్, లెమన్ జ్యూస్ తేనె మిక్స్ చేసి ముఖానికి స్ర్కబ్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఫలితానలు అంధిస్తుంది . చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది . చర్మరంధ్రాల్లో చేరిన అన్ని రకాల దుమ్ముధూళిని శుభ్రం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: