వేపాకు.. ఆయుర్వేదం.. ఆత్మీయం.. వేపాకుతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు అన్ని చెప్తే ఆశ్చర్య పోతారు. వేపతో అందంగా తయారవుతారు. వేపతో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. అయితే అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి. ఆ గుణాలు ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను, మొటిమలను తొలిగిస్తాయి. అలానే దద్దుర్లు, దురద, మంటతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారి నుంచీ కూడా ఈ వేపాకులు చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

 

అంతేకాదు... చుండ్రుతో భాధపడేవారు వేప ఆకుల చూర్ణాన్ని తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు బలంగా తయారయ్యి జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.

 

వేపలో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఇవి రక్తాన్ని శుద్ధిచేయడంలో తోడ్పడుతాయి. కాలేయం, మూత్రపిండాల నుంచి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపించడంలోనూ సహాయపడుతాయి. 

 

రోజూ కొద్ది మోతాదులో వేప కషాయాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవడమే కాకుండా రక్తంలో చక్కెర నిల్వలు, బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

 

కడుపులో దేవినట్లవడం, తేన్పులు రావడం వంటి సమస్యలతో బాధ పడేవారు వేప కషాయాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: