అమ్మాయిలు అందరి కన్నా ప్రత్యేకంగా, హుందాగా, అందంగా కనిపించడానికి ఇష్టపడతారు. ఈ క్ర‌మంలోనే చ‌ర్మం త‌ర్వాత జుట్ట‌కు ఎక్కువ ప్రాధాన‌త్య ఇస్తుంటారు. కాని, అనేక జుట్టు స‌మ‌స్య‌లు వెంబ‌డిస్తుంటాయి. అయితే ఈ స‌మ‌స్య‌లు నివారించుకోవడానికి చాలామంది రకరకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈసారి మీ జుట్టు సమస్యలను నివారించుకోవడానికి నూనెలు, షాంపూలు కాకుండా కేవలం క్యారెట్ మాస్కులు ట్రై చేయండి. త‌ప్ప‌కుండా మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది.

 

అందుకు ముందుగా క్యారెట్‌ను పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా కొబ్బ‌రి నూనె కలిపి మరింత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు, మాడుకు అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మీ చేతి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి. జుట్టు బాగా ఆరనిచ్చిన తరువాత చల్లని నీటితో మీ జుట్టును శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య‌లు త‌గ్గి మృదుగా కూడా త‌యార‌వుతుంది. క్యారెట్ పేస్ట్ మ‌రియు పెరుగు బాగా క‌లిపి జ‌ట్టుకు బాగా ప‌ట్టించుకోవాలి.

 

ఒక అర‌గంట పాటు జ‌ట్టు ఆర‌నిచ్చి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు మృదువుగా మారుతుంది. అదే విధంగా అనేక జుట్టు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. క్యారెట్ పేస్ట్‌, నిమ్మ‌ర‌సం, ఆలీవ్ ఆయిల్ మూడు క‌లిపి జ‌ట్టుకు అప్లై చేయాలి. కొన్ని నిమిషాల పాటు మీ చేతి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి. జుట్టు బాగా ఆరనిచ్చిన తరువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, చండ్రు స‌మ‌స్య‌లు వంటివి త‌గ్గుతాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: