మీ గోర్లు తరచూ చిట్లిపోతూ ఉంటాయా? అలాగే, పెరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయా? మీ గోర్లు ఆకర్షణీయంగా లేకుండా మొద్దుబారినట్లుంటాయా? మీ గోర్లలో సహజసిద్ధమైన మెరుపు నశించిందా? ఈ ప్రశ్నలు మ‌న‌ల్ని వెంటాడుతుంటాయి. అయితే  చేతి గోళ్లు అందంగా కనపడాలంటే మెనిక్యూర్‌ ఒక్కటే మార్గం కాదు.  గోర్లు బలంగా అందంగా పెరగాలంటే కొన్ని చిట్కాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే గోళ్లు బలంగా చిట్లిపోకుండా పెరుగుతాయి. ముఖ్యంగా వెల్లుల్లి మరియు నిమ్మలో గోర్ల సంరక్షణకు తోడ్పడే మినరల్స్ సమృద్ధిగా లభ్యమవుతాయి.

 

వెల్లుల్లిలో సల్ఫర్ అనేది అధికంగా లభిస్తుంది. ఇది చిట్లిన గోర్లను దృఢపరచి గోర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. మ‌రియు నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ అనేది పాలిపోయిన గోర్లని తిరిగి ఆరోగ్యంగా చేసేందుకు దోహదపడతాయి. అయితే మ‌రి వీటిని ఎలా ఉప‌యోగించాలంటే.. ముందుగా వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సాన్ని క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని గోర్ల‌కు ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గోర్లు దృఢంగా అందంగా ఉంటాయి.

 

ఒక కప్పుడు నీళ్లను మరగబెట్టి అందులో క్రష్ చేయబడిన వెల్లుల్లి రెబ్బను జోడించండి. ఇప్పుడు, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా కలపండి. వీటిని పది నిమిషాల పాటు సిమ్ లో మరగనిచ్చి కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు, ఈ సొల్యూషన్ ను ఒక ఖాళీ సీసాలోకి మార్చుకుని ప్రతిరోజూ మీరు నిద్రపోయే ముందు దీన్ని మీ గోర్లపై పై అప్లై చేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల గోర్లు పొడ‌వుగా, అందంగా పెరుగుతాయి. అలాగే నిమ్మ‌ర‌సంలో కొద్దిగా కొబ్బ‌రి నూనె క‌లిపి గోర్ల‌కు అప్లే చేస్తే.. గోర్లకు తగినంత పోషణనిచ్చి దృఢపరుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: