జిహ్వకో రుచి... పుర్రెకో బుద్ది అంటారు కదా.  మనిషి ఎప్పుడు కొత్తదనం కోరుకుంటాడు.  కొత్తగా ఉండేందుకు ఇష్టపడతాడు.  కొత్తగా ఏదైనా చేయడానికి ఆసక్తి చూపిస్తాడు.  స్వేచ్ఛగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.  ఇప్పుడు స్వేచ్ఛకు అర్ధం మారుతున్నది.  


ఒకప్పుడు స్వేచ్ఛగా ఉండటం అంటే మనకు ఇష్టం వచ్చినట్టుగా ఉండటం.  ఇప్పుడు స్వేచ్ఛగా అంటే.. ఒంటిపై నూలుపోగు లేకుండా దిగంబరంగా ఉండటం అనే అర్ధంగా మారిపోయింది.  అయ్యయ్యో అదేంటి అలా ఎలా ఉంటారు అని భయపడకండి.  సిగ్గు ఉండదా అనుకోకండి.  


ఇటీవలే యూకేలో బహిరంగ ముద్దుల కార్యక్రమం ముగిసింది.  ఇప్పుడు అక్కడ మరో కొత్త కార్యక్రమం మొదలైంది.  అదే న్యూడ్ షో.  ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఎవరు కూడా ఒంటిపై నూలుపోగు వేసుకోకూడదు.  నగ్నంగా ఉండాలి.  ఈ కార్యక్రమం 10 రోజుల పాటు ఉంటుంది.  


ఇందులో పాల్గొనే వాళ్లంతా న్యూడ్ గా ఉంటారు. ఒకరి కొకరు మాట్లాడుకుంటూ పరిచయాలు పెంచుకుంటారు.  కథలు చెప్పుకుంటూ సరదాగా గడుపుతారు.  ఉదయాన్నే యోగా, ధ్యానం 10 కిలోమీటర్ల రన్నింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారట.  వినడానికి విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం.  


మరింత సమాచారం తెలుసుకోండి: