అందంగా ఉండాలని ఎవరు అనుకోరు చెప్పండి. సహజంగా అందమైన ముఖాకృతి కలిగి, చర్మం మేలిమి చాయతో ఉన్న వాళ్ళు, తమ అందం మరింత మెరుగయ్యేలా, పాడవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తినే ఆహారం మొదలు, వ్యాయామం, కట్టుకునే బట్ట వరకూ అన్ని విషయాలలో జాగ్రత్తలు వహిస్తారు. అయితే మధ్య తరగతి వాళ్ళు ఇవన్నీ చూసి అందం కాపాడుకోవడం ఇంత ఖరీదైన విషయమా అంటూ నోళ్ళు వెళ్ళబెడుతారు.  కానీ

 Image result for glowing skin

ఇంట్లోనే మీ అందాన్ని మెరుగు పరిచే అద్భుతమైన చిట్కాలు ఎన్నో పూర్వం నుంచీ అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కొబ్బరి పాలు, పెసరి పిండి, అరటిపండు గుజ్జు తో చేసే సౌందర్య సాధనం. ఇది చర్మాన్ని మొటిమలు లేకుండా, సున్నితంగా చేసి  మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగ పడుతుంది. అయితే ఈ సాధనాన్ని ఎలా తాయారు చేయాలంటే

 Image result for curd face pack

ముఖానికి పట్టేలా కొన్ని కొబ్బరి పాలని తీసుకుని వాటిని ముఖానికి బాగా పట్టించాలి. కొన్ని నిమిషాల తరువాత మెత్తటి దూదితో శుభ్రంగా తుడిచేయాలి. ఆ తరువాత పెసర పిండి, పచ్చి పాలు ఒక గిన్నెలోకి తీసుకుని ఒక ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. ఆ తరుఅవాట చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుని, అరటిపండు గుజ్జు, పెరుగు, నిమ్మరసం తగినంత తీసుకుని ముఖానికి పట్టించాలి. దాదాపు 20 నిమిషాలు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన ముఖం ఎంతో ఛాయగా, ప్రకాశవంతగా తయారవుతుంది.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: