స‌హ‌జంగా రోజ్ వాటర్ అందంగా ఉండాలని కోరుకునే ప్రతి అమ్మాయి ఇంట్లోనూ ఉంటుంది. ధర కూడా అందుబాటులోనే ఉండడంతో దీని వాడకమూ పెరిగింది. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దీని తరువాతే ఎవరైనా. ఖరీదైనా టోనర్ లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు ఇలాంటి వాటి అవసరం లేకుండా... వాటి పని కూడా రోజ్ వాటర్ చేసేస్తుంది. రోజ్ వాటర్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.


ఇందులో కూడా వివిధ రకాల విటమిన్స్ ఉన్నాయి. రోజ్ వాటర్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టిరియాలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . రోజంతా బయటి పనులతో మనమూ, మనతో పాటూ చర్మం కూడా వడలిపోతుంది. అయితే రోజ్ వాట‌ర్ వ‌ల్ల ఉప‌యోగాలు చూద్దాం..


- రోజ్ వాటర్ ను టోనర్ గా ఉపయోగించడం వల్ల ఇది ముఖంలో ముడుతలను మరియు మచ్చలను నివారిస్తుంది. అయితే కళ్ళలో రోజ్ వాటర్ పడకుండా చూసుకోవాలి.


- రోజ్ వాటరు కీటకాలు కుట్టిన ప్రదేశంలో అప్లై చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.


- ఐ మేకప్ తొలగించడానికి కొద్దిగా రోజ్ వాటర్ అప్లై చేయాలి . రోజ్ వాటర్ మరియు జోజోబా ఆయిల్ రెండూ ఈక్వెల్ గా తీసుకొని అప్లై చేసి కాటన్ తో తుడవాలి.


- మొటమలు మరియు మచ్చలను వల్ల చర్మ దురదగా అనిపిస్తుంటే కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటితో ముఖానికి శుభ్రం చేసుకోవాలి. ఇది ఇరిటేషన్ తగ్గిస్తుంది .


- జాస్మిన్ ఆయిల్లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మీ శరీరానికి అప్లై చేయడం వల్ల, శరీరం యొక్క దుర్వాసనను నివారిస్తుంది .


- సన్ బర్న్ అయిన ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ ను అప్లై చేస్తే సన్ బర్న్ నుండి ఉపశమనం కలుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: