మార్చి 9వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. ఈరోజు ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి... 

 

 ఆర్పి పట్నాయక్ జననం : ప్రముఖ తెలుగు సినీ నటుడు సంగీత దర్శకుడు... గాయకుడు సినీ దర్శకుడు అయిన ఆర్పీ  పట్నాయక్  మార్చ్ 9, 1972 వ తేదీన జన్మించారు. ఆర్పి పట్నాయక్ పూర్తిపేరు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్.. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు సంగీత దర్శకుడిగా... నటుడిగా రచయితగా మరియు చిత్ర దర్శకుడు గా సేవలు అందించారు. ఆయన పాడిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఇక ఎన్నో సినిమాల్లో ఆయన నటనకు గాను ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. దర్శకుడిగా నటుడిగా సంగీత దర్శకుడిగా ఆయన సత్తా చాటి  ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సినీరంగంలో  ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని  అందించారు. నువ్వు నేను,  సంతోషం, ఎక్స్ క్యూస్ మీ  అనే సినిమాలకు సంగీతాన్ని అందించి... తెలుగు ప్రేక్షకులను అలరించారు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. అయితే ఈ మూడు సినిమాలకు గాను ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు ఆర్.పి.పట్నాయక్. అంతేకాకుండా నువ్వు నేను అందమైన మనసులో,  బ్రోకర్ లాంటి  చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డులను అందుకున్నారు. ఇక రెండు మూడు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఎన్నో సినిమాల్లో నటుడిగా కూడా తన సత్తా చాటారు ఆర్ పి పట్నాయక్. 

 

 

 యూరి గగారిన్ జననం : మొట్టమొదటిసారి అంతరిక్షంలో కాలుమోపిన  మానవుడిగా రికార్డు సృష్టించారు యూరీ గగారిన్. ఈయన 1934 మార్చి 9వ తేదీన జన్మించారు. యూరీ గగారిన్ ఒక సోవియట్ వ్యోమగామి. రష్యన్లు ఇతడిని సోవియట్  హీరో గా పరిగణిస్తారు. 1961 ఏప్రిల్ 12వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడుగా  చరిత్ర పుటలకెక్కారు యూరి గగారిన్. భూమి చుట్టూ కక్షలో  పరిభ్రమించిన  వాడుగా రికార్డు సృష్టించారు. మొట్టమొదటిసారి అంతరిక్షం లోకి ప్రవేశించినందుకుగాను అనేక దేశాలు పథకాలు బహుమానాలు ఇచ్చి గౌరవించాయి. 

 

 

 జాకీర్ హుస్సేన్ జననం : ఎంతో ప్రఖ్యాతి చెందిన భారతీయ తబలా విద్వాంసుడు సంగీత దర్శకుడు మరియు నటుడు అయిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9వ తేదీన జన్మించారు. వీణ తబలా విద్వాంసులుగా సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. 1988 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని 2002లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసి గౌరవించింది. జాకీర్ హుస్సేన్ మొదటి ఆల్బమ్  1991 లో విడుదలైంది. 1992లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్గా గ్రామీ అవార్డును అందుకుంది జాకీర్ హుస్సేన్ సమకూర్చిన ఆల్బం.

మరింత సమాచారం తెలుసుకోండి: