జూన్ 1వ తేదీన ఒకసారి చరిత్రలోకి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరీ ఒక్కసారి  చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 


 


 మాధవన్ జననం : ప్రముఖ భారతీయ నటుడు మాధవన్  భారత సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితులే.. నటుడు మాధవన్ 1975 జూన్ 1వ తేదీన జన్మించారు. వివిధ భాషల్లో హీరోగా నటించిన మాధవన్  ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కూడా నటించారు. ఇక తన నటనకు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను సైతం గెలుచుకున్నారు మాధవన్ . ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలకు నిర్మించారు . మరికొన్ని సినిమాలకు దర్శకుడిగా పనిచేశారు మాధవన్. నటుడు మాధవన్ పెళ్లి  తర్వాత 29 సంవత్సరాల వయస్సులో తన కెరీర్ను ప్రారంభించారు. సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు మాధవన్ . తన నటనకు గాను ఎన్నో ఫిలింఫేర్ అవార్డును సైతం గెలుచుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా వివిధ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నారు మాధవన్ . తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. 

 


 సోనా జననం : ప్రముఖ భారతీయ నటి అయిన సోనా 2002 సంవత్సరంలో మిస్ సౌత్ ఇండియా గా నిలిచారు. ఈమె  1979 జూన్ 1వ తేదీన జన్మించారు. ఇక చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించారు ముఖ్యంగా కోలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ తో  ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తమిళ సినిమాల్లో కూడా నటించి ఎంతో క్రేజ్ సంపాదించారు.కొన్ని  సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేశారు. బెస్ట్ ఇంటర్ప్రినియార్  ఇయర్ అవార్డును కూడా 2010 సంవత్సరంలో గెలుచుకున్నారు. 

 

 నిఖిల్  సిద్ధార్థ  జననం : దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్ధ 1985 జూన్ 1వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన ప్రస్థానం మొదలుపెట్టిన నిఖిల్ ఆ తర్వాత హీరోగా వరుస  అవకాశాన్ని దక్కించుకున్నారు. హ్యాపీడేస్ శసినిమా  ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా   మారిపోయాడు సిద్ధార్థ  అంతకు ముందు వరకు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్  వేశాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్న సిద్ధార్థ ఎంతగానో  గుర్తింపు సంపాదించారు . ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ హీరోలలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా సిద్ధార్థ పెళ్లి కూడా చేసుకున్నారు. 

 


 హేమ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి హేమ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలే . కాగా హేమ 1967 జూన్ 1వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు హేమ . హాస్య నటిగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తనదైన  కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు హేమ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా కీలక పదవిలో కొనసాగుతున్నారు హేమ . అతడు సినిమా తర్వాత ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హేమ  ఆ తర్వాత జూలాయి  లో కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: