జూన్ 6వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 కె.ఎల్.రావు జననం : ప్రముఖ ఇంజనీరు రాజకీయ నాయకుడు అయిన కానూరి లక్ష్మణరావు 1902 జూన్ 6వ తేదీన జన్మించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈమె ఎంతగానో కృషి చేశారు. పదవీ విరమణ చేశాక కేంద్రంలో నెహ్రూ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కానూరి లక్ష్మణరావు. 1972లో గంగా కావేరి నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించింది కూడా ఈయనే . 1962 నుండి  1977 వరకు మూడు పర్యాయాలు విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఈయన  జవహర్లాల్ నెహ్రూ,  లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కూడా పది సంవత్సరాల పాటు కేంద్ర నీటిపారుదల, విద్యుచ్ఛక్తి శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. దేశంలో అనేక భారీ ఆనకట్టల రూపకల్పనలో ఆయన పాత్ర కీలకంగా ఉంది. ప్రపంచంలోనే మట్టితో కట్టిన అతిపెద్ద ఆనకట్ట నాగార్జునసాగర్ రూపకల్పన చేసింది కూడా ఈయనే. 

 


 సునీల్ దత్ జననం : ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు నిర్మాత రాజకీయ నాయకుడు అయిన సునీల్ దత్ అసలు పేరు బాలరాజు దత్. ఈయన 1935 జూన్ 6వ తేదీన జన్మించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే సునీల్ దత్ క్రీడా యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఈయన  తనయుడు సంజయ్ దత్ కూడా బాలీవుడ్ లో ప్రముఖ నటుడు. 1968 లో భారత ప్రభుత్వం సునీల్ దత్ ను పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది.  కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయన వాయువ్య  ముంబై నియోజకవర్గం నుంచి 5 సార్లు  ఎంపీగా ఎన్నికయ్యారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. రేడియో కార్యక్రమాలతో కెరియర్ ప్రారంభించిన సునీల్ దత్ సిలోన్ రేడియో లో హిందీ ప్రసారాలతో గుర్తింపు  సంపాదించారు. 1957 లో విడుదలైన మదర్ ఇండియా సినిమాతో స్టార్ గా ఎదిగారు సునిల్ దత్ . 

 

 దగ్గుబాటి రామానాయుడు జననం : తెలుగు సినిమా నటుడు రచయిత నిర్మాత ఒక పార్లమెంటు మాజీ సభ్యులు అయిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు... ఏకంగా 100 చిత్రాలకు పైగా నిర్మాతగా వ్యవహరించి ప్రపంచ రికార్డును సృష్టించారు రామానాయుడు. మూవీ మొఘల్ గా దగ్గుబాటి రామానాయుడు ను  అభివర్ణిస్తూ ఉంటారు. ఇక ఈయన ఎంతోమంది నేటితరం నిర్మాతలకు కూడా స్ఫూర్తిగా ఉన్నారు. ఈయన  సినీ పరిశ్రమలో చేసిన సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం దగ్గుబాటి రామానాయుడు కి  దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కూడా ప్రకటించింది. 2015 లో ఫిబ్రవరి 18న హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించారు దగ్గుబాటి రామానాయుడు. ఈయన  వారసులుగా హీరో వెంకటేష్, స్టార్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొనసాగుతున్నారు.

 


 జ్యోతి రాణి జననం : ప్రముఖ రంగస్థల నటి అయిన జ్యోతిరాణి 1976 జూన్ 6వ తేదీన జన్మించారు. సుమారు 20 సంవత్సరాల రంగస్థలం ఎన్నో నాటకాలు వేసింది. నటిగా ఎంతో గుర్తింపు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: