బాలీవుడ్‌కు రాక్ అండ్ డిస్కో సంగీతాన్ని అందించిన గాయకుడు బప్పి లహిరి ఈరోజు తన 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బప్పి లహిరి 1952 నవంబర్ 27న పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు. బప్పి లహిరి డిస్కో పాటల సృష్టికర్తగా ఇప్పటికీ ఎప్పటికి బాలీవుడ్ కు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అందించారు. దీని కారణంగా ఆయనను డిస్కో కింగ్ అని పిలుస్తారు. ఆయన తన ప్రత్యేకమైన శైలి, డ్రెస్సింగ్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందాడు. బప్పి లహిరి 'తమ్మా తమ్మా' నుండి 'డిస్కో డాన్సర్' వరకు చాలా పాటలు పాడారు. ఇది ఇప్పటికీ ప్రజల ఫేవరేట్ ప్లే లిస్ట్ లో భాగంగానే ఉంది. దే దే ప్యార్ దే, జిమ్మీ జిమ్మీ ఆజా అతని ప్రసిద్ధ కంపోజిషన్లలో ఉన్నాయి. బప్పి లహిరి 600 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించారు. బప్పి లాహిరి 4 దశాబ్దాలకు పైగా వినోద పరిశ్రమలో పని చేశారు. ఈ రోజు బప్పి లహిరి పుట్టిన రోజున అతని ఎవర్‌గ్రీన్ పాటల గురించి తెలుసుకుందాం.

తమ్మా తమ్మా (షో)
తానేదార్‌ చిత్రంలోని ఈ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ పాటను అనురాధ పౌడ్వాల్, బప్పి లాహిరి పాడారు. ఈ పాట నేటికీ ప్రజల ప్లే లిస్ట్ లో భాగంగానే ఉంది. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్‌లపై ఈ పాటను చిత్రీకరించారు.

 

బప్పి లహిరి సూపర్‌హిట్ పాటల రీమిక్స్‌లు కూడా చేశారు. అయితే అవి ఏ విధంగానూ పాతగా లేకుండా చూసుకున్నారు. సాహెబ్ చిత్రంలోని 'యార్ బినా చైన్ కహాన్ రే' సూపర్‌ హిట్ పాట. అనిల్ కపూర్, అమృతా సింగ్‌లపై ఈ పాటను చిత్రీకరించారు.


ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్
మిథున్ చక్రవర్తి సినిమా డిస్కో డ్యాన్సర్ సూపర్‌ హిట్. ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అనే ఈ చిత్రంలోని పాటలతో మిథున్ చక్రవర్తి స్టార్ అయ్యాడు.



ఊలాలా సాంగ్
విద్యాబాలన్ నటించిన ది డర్టీ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఈ చిత్రంలోని పాటను ఊలాలాను బప్పి లహిరి పాడారు. ఇప్పటికీ ఈ పాటను జనాలు బాగా ఇష్టపడుతున్నారు.



జిమ్మీ జిమ్మీ ఆజా
మిథున్ చక్రవర్తి చిత్రం డిస్కో డాన్సర్‌లోని ప్రతి పాట సూపర్‌ హిట్ అయ్యింది. ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ తర్వాత జిమ్మీ జిమ్మీ ఆజా అనే పాట హిట్‌గా నిలిచింది. ఈ పాటను బప్పి లహిరి పాడారు.



మరింత సమాచారం తెలుసుకోండి: