ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కుమ్మేసింది. బుధ‌వారం ఉద‌యం అప్‌డేట్‌ను బ‌ట్టి చూస్తే 14.31 ల‌క్ష‌లకు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా మ‌ర‌ణాలు 82 వేల‌కు చేరుకున్నాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా, స్పెయిన్‌, ఇటలీ దేశాలు టాప్ - 3 ప్లేసులో ఉన్నాయి. ఇక మ‌న‌దేశంలో కూడా క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇవి ఇప్ప‌టి వ‌ర‌కు 5351 కు చేరుకున్నాయి. క‌రోనా సోకి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 160 మంది మృతిచెందారు. మ‌న దేశంలో గ‌త వారం రోజులుగా క‌రోనా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ ను క‌ట్ట‌డి చేసేందుకు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసులు మాత్రం ఆగ‌డం లేదు.

 

ముఖ్యంగా మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల త‌ర్వాతే ఈ కేసులు అధిక‌మ‌య్యాయి. ఇక క‌రోనా నుంచి మ‌న‌దేశంలో కోలుకున్న వారి సంఖ్య 421కు చేరుకుంది. క‌రోనా దెబ్బ‌తో మ‌న దేశంలో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌మిళ‌నాడులో న‌మోదు అవుతున్నాయి. ఇక మ‌న దేశంలో కేర‌ళ‌లో జ‌న‌వ‌రి 3వ తేదీన తొలి క‌రోనా కేసు న‌మోదు అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా స్వైర‌విహారం చేస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: