ఏపీలో సైతం క‌రోనా విజృంభిస్తోంది. గ‌త వారం రోజులుగా మ‌ర్క‌జ్ కేసుల‌తో ఏపీలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు విస్తృతంగా పెరుగుతూ వ‌చ్చింది. అయితే మంగ‌ళ‌వారం కేవ‌లం ఒక్క కొత్త కేసు మాత్ర‌మే న‌మోదు అయ్యింది. అది కూడా గుంటూరు జిల్లాలో న‌మోదు అయ్యింది. దీంతో క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది అనుకుంటున్న టైంలో బుధ‌వారం అదిరిపోయే షాక్ త‌గిలింది. ఏకంగా 15 కొత్త కేసులు న‌మోదు అవ్వ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. గ‌త 15 గంట‌ల్లో మొత్తం 15 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 6 కేసులు న‌మోదు అయ్యాయి. 

 

ఇక చిత్తూరు జిల్లాలో సైతం మ‌రో 3 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వ‌ర‌కు క‌రోనా కేసులు 329 అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకి ఏపీలో ఆరుగురు కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే క‌ర్నూలు జిల్లాలో అత్య‌ధికంగా 74 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఆ త‌ర్వ‌త ప్లేసుల్లో నెల్లూరు, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఏపీ ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా ప్ర‌ధానంగా మ‌ర్క‌జ్ కేసుల వ‌ల్లే ఇక్క‌డ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: