భారత దేశంలో ఇప్పుడు కరోనాని పూర్తిగా అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయినా కూడా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,194 చేరినట్టు ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 149కి చేరిందని పేర్కొంది. కరోనాపై చర్యలు, లాక్ డౌన్ పొడిగింపుపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కీలకం కాబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతల సలహాలు, సూచనలు మోదీ తీసుకోనున్నారు.

 

కరోనా కేసులు తగ్గకపోవడంతో ఈనెల 14 తర్వాత కూడా కొంతకాలంపాటు లాక్ డౌన్‌ను కొనసాగించాలనే కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో అన్న విషయం పై  ఆయుష్ మంత్రిత్వశాఖ.. ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. రోజూ గోరువెచ్చని నీళ్లు తాగాలని, ఉదయాన్నే చ్యావన్‌ప్రాష్ వంటి ఆరోగ్య ఉత్పత్తులు తీసుకోవాలని చెప్పింది.

 

అలాగే రోజుకు ఒకసారిగానీ, కుదిరితే రెండుసార్లుగానీ పాలలో పసుపు కలుపుకొని తాగాలని సూచించింది. పొడి దగ్గు, గొంతు సమస్యలుంటే పుదీనా వంటి ఆకులు వేసి, ఆవిరి పట్టడం లాంటివి చేయాలని తెలిపింది. వంటల్లో కూడా ధనియాలు, అల్లం, పసుపు వంటివి ఉపయోగించాలని సూచించింది. అంతే కాదు దీనికి సంబంధించిన వివరాలను ఆరోగ్యశాఖ వెబ్‌సైట్లో పొందుపరిచింది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: