ఏపీలోని క‌ర్నూలు జిల్లాను క‌రోనా వ‌ణికిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోని 13 జిల్లాల్లో క‌రోనా లేని జిల్లాలుగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయి. ఇక నిన్న‌టి వ‌ర‌క క‌రోనా కేసుల విష‌యంలో నెల్లూరు, గుంటూరు జిల్లాలు టాప్‌లో ఉండ‌గా... క‌ర్నూలు జిల్లా గ‌త రెండు రోజుల్లో ఈ రెండు జిల్లాల‌ను క్రాస్ చేసి మ‌రీ టాప్ ప్లేస్‌లోకి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ జిల్లాలో క‌రోనా కేసులు ఏకంగా 74కు చేరుకోగా.... జిల్లాలో తీవ్ర ఆందోళ‌నక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన వారే ఉన్నారు.

 

విచిత్రం ఏంటంటే ఇటీవ‌ల పాణ్యంకు చెందిన 45 ఏళ్ల వ్య‌క్తి చ‌నిపోయాడు. అత‌డు ఢిల్లీ వెళ్ల‌లేదు. అయితే ఢిల్లీకి వెళ్లివచ్చిన వారిని కలవడం లేదా నంద్యాల ఆటోనగర్‌లో వెల్డర్‌గా పనిచేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చిన వ్యక్తుల ద్వారా ఇతనికి కరోనా వచ్చి ఉండొచ్చనే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు చాలా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిని బ‌ట్టి చూస్తుంటే క‌రోనా ఎంత సైలెంట్ కిల్ల‌ర్‌గా ప‌ని చేస్తుందో ?  అర్థ‌మ‌వుతోంది. 

 

ఇక క‌ర్నూలు జిల్లాలో చూస్తే కర్నూలు 19, నంద్యాల 18లో అత్య‌ధికంగా కేసులు న‌మోదు అయ్యాయి. కరోనా బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిని నిర్బంధ పరిశీలనలో ఉంచకపోతే వందల మంది, వారి నుంచి వేల మంది వ్యాధి బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 ప్రాంతాల‌ను రెడ్ జోన్లుగా గుర్తించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: