తెలంగాణ‌లో క‌రోనా స్వైర‌విహారం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ మొత్తం 404 కేసులు ఉండ‌గా.. ఇప్పుడు బుధ‌వారం మ‌రో 49 కొత్త కేసులు న‌మోదు అవ్వ‌డంతో ఈ కేసులు ఏకంగా 453కు చేరుకున్నాయి. ఈ విష‌యాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బుధ‌వారం సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి వివ‌రించారు. ఇక తెలంగాణ‌లో క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 45 మంది ఉన్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1100 మందికి ప‌రీక్ష‌లు చేశామ‌ని తెలిపారు. 

 

అలాగే రాష్ట్రంలో మొత్తం 167 సెంట‌ర్ల నుంచి 3158 మందిని క్వారంటైన్ నుంచి ఇంటికి పంపుతున్నారు. ఇక 15 రోజుల్లో మొత్తం 1500 బెడ్ల‌ను రెడీ చేసిన‌ట్టు కూడా చెప్పారు. ఏదేమైనా తెలంగాణ‌లో క‌రోనా రోజు రోజుకు విజృంభించ‌డంతో ఇప్పుడు అక్క‌డ తీవ్ర ఆందోళ‌న‌కర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక ఇండియాలో గ‌త 24 గంటల్లొ మొత్తం 32 మ‌ర‌ణాలు.. మొత్తం 773 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ముంబై క‌రోనాకు కేంద్ర బిందువుగా మారింది. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే ఏకంగా 1000కు పైగా కేసులు న‌మోదు అయ్యాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: