ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డికి యోగీఆదిత్య‌నాథ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను (హా ట్‌స్పాట్లు) ఈనెల 15వ తేదీ వరకు పూర్తిగా మూసివేసేందుకు నిర్ణ‌యించింది. హోమ్‌ డెలివరీ, వైద్య బృందాలను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండటంతో ఒకరి నుంచి మరొకరి కోవిడ్‌ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు అక్క‌డి అధికారులు వెల్లడించారు.

లక్నో, ఆగ్రా, ఘజియాబాద్‌, గౌతమ్‌బుద్ధ నగర్ (నోయిడా), కాన్పూర్‌, వారణాసి, షామ్లి, మీరట్‌, బరేలీ, బులంద్‌షహర్‌, ఫిరోజాబాద్‌, మహరాజ్‌గంజ్‌, సీ తాపూర్‌, సహరన్‌పూర్‌, బస్తీ జిల్లాల్లోని హాట్‌స్పాట్‌లను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. మొత్తం జిల్లాలను మూసివేయడం లేదని, హాట్‌స్పాట్ల వరకే ఇది పరిమితమని హెంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్‌ అవస్థి స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 20 హాట్‌స్పాట్లు మూసి వే శారు.  ఆగ్రాలో 22, ఘజియాబాద్‌లో 13, లక్నో, కాన్పూర్‌, నోయిడాల్లో 12, మీరట్‌లో 7, వారణాసి, షహరన్‌పూర్‌, మహరాజ్‌గంజ్‌లలో 4, షామ్లి, బులంద్‌షహర్‌, ఫిరోజాబాద్‌, బస్తిల్లో 3 చొప్పున హాట్‌స్పాట్‌లను గుర్తించినట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: