ప్రపంచవ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని దేశాలపై కోవిడ్‌-19 తన ప్రతాపం చూపుతోంది. ప్రధానంగా అగ్ర రాజ్యాలే దీని దాటికి క‌కావిక‌లం అయిపోతున్నాయి. వైర‌స్‌కు ఇప్ప‌టి ఎలాంటి ఎలాంటి మందు లేకపోవడంతో వేలాది మంది ప్రాణాలు  గాల్లో క‌లుస్తున్నాయి. రోజు రోజుకూ ఈ ప్రాణాంతక వైర‌స్ మరింత తీవ్రం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అమెరికాలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం కేసుల సంఖ్య 15,13243 ఉండగా మరణాలు 88,403గా ఉన్నాయి. 

అమెరికాలో 4,30,210 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్క రోజే 1895 మంది మరణించారు.  స్పెయిన్ 1,48,220, ఇటలీ 1,39,422, జర్మనీ 1,13,296, ఫ్రాన్స్ 1,12,950గా ఉండగా, వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం 81,802 కేసులు మాత్రమే నమోదు అయయాయి. మిగితా దేశాల్లోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే 5,734 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 166 మంది ప్రాణాలు వదిలారు. దేశవ్యాప్తంగా రోజుకు 500కుపైగా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇటు తెలంగాణలో 453 మందికి సోకింది. ఏపీలో 348 మందికి పాజిటివ్ అని తేలింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: