ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా కేసులు 15 ల‌క్ష‌లు దాటేశాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు 88 వేలు దాటి 90 వేల దిశ‌గా వెళుతున్నాయి. మ‌నదేశంలో సైతం క‌రోనా క‌రోనా పాజిటివ్ కేసులు 6 వేల‌కు ద‌గ్గ‌ర్లో ఉండ‌గా ఇక క‌రోనా మ‌ర‌ణాలు 166 ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతూ ఉండ‌గా కరోనా వైరస్‌ కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 

 

తెలంగాణ‌లో క‌రోనా మ‌ర‌ణాలు 11 ఉండ‌గా.. క‌రోనా కేసులు 364కు చేరుకున్నాయి. ఇక ఏపీలో మ‌ర‌ణాలు 4కు చేరుకోగా 329కు చేరుకున్నాయి. ఇక ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గ‌డ‌మే ఉన్నంత‌లో కాస్త ప‌రిస్థితి మెరుగు ప‌డింద‌ని చెప్పుకోవాలి. తాజాగా ఏపీలో 217 క‌రోనా టెస్టుల ఫ‌లితాలు రాగా అవ‌న్నీ నెగిటివ్ వ‌చ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 348 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 90 శాతం మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారే ఉండడం గమనార్హం.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం ఉద‌యం 12 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 15, 19, 213

మృతుల సంఖ్య - 88, 531

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 3, 30, 877

యాక్టివ్ కేసుల సంఖ్య - 10, 99, 805

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 4, 19, 408

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 4, 35, 160 - 14, 797

స్పెయిన్ - 1, 48, 220 - 14, 792

ఇట‌లీ - 1, 39, 422 - 17, 669

 


భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 5916

మృతులు - 178

తెలంగాణ‌లో కేసులు - 364

తెలంగాణ మృతులు - 11

ఏపీలో కేసులు - 329

ఏపీ మృతులు - 4

అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 74 కేసులు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: