కరోనా కారణంగా భరత్ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూలేని విధంగా తగ్గింది , లాక్ డౌన్ కారణంగా ఎన్నో వ్యాపార సంస్థలు మరియు చిన్న , మధ్య తరహా పరిశ్రమలు నష్టాల పాలయ్యాయి . ఈ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్రప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉద్దీపన ప్యాకేజి ప్రకటించనుంది . కరోనా ప్రభావ తీవ్రత ను అంచనా వేసిన తరువాత కేంద్రప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించనుంది . ఈ ప్యాకేజి సుమారు 10 వేల కోట్లతో ఈ ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది . 

 

ఈ లాక్ డౌన్ కారణం గా నష్టపోయిన చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ భారత ఎకానమీ ని వృద్ధి చేయాలి అని కేంద్రం భావిస్తోంది . ఈ ప్యాకేజి ని ప్రకటించిన తరువాత పెద్ద తరహా పరిశ్రమలకు కూడా కేంద్రం మరో ప్యాకేజిని ప్రకటించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: