ప్రపంచంలో ఇప్పుడు కరోనా పేరు చెబితే ఉలిక్కి పడుతున్నారు.  మనుషుల మద్య దూరాన్ని పెంచింది.. మనిషిని మనిషి తాకే పరిస్థితిలో లేకుండా పోయింది.. వేలల్లో మరణాలు.. లక్షల్లో బాధితులు మొత్తానికి కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం అతలా కుతలం చేస్తేస్తుంది.  ఇంత భయంకరమైన కరోనా చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చింది.  చైనాలో మొదలైన ఈ ప్రాణాంతక కరోనా ఇప్పుడు  205 దేశాల్లో విస్తరించి అల్లకల్లోలం చేస్తుంది.  చైనా తర్వాత కాదు.. చైనా కంటే మించి ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాల్లో ల్లో ప్రాణాలు పోతున్నాయి. బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. 

 

ఇంతటి విపత్కర పరిస్థితి తీసుకు వచ్చిన పుహాన్ లో 75 రోజుల పాటు కఠినమైన లాక్ డౌన్ పాటించారు.  75 రోజుల పాటు ఇళ్లకే పరిమితమై, నానా ఇబ్బందులూ పడ్డ నగరవాసులు, ఇప్పుడు వీధుల్లోకి వచ్చేశారు. విమానాలు, రైల్ సర్వీసులు పునరుద్ధరించబడటంతో మొన్నటి వరు ముఖానికి మాస్క్ లేకుంటే బయటకు రాని ప్రజలు ఇప్పుడు కాస్త స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నగరంలోని ఫ్యాక్టరీలన్నీ తిరిగి తెరచుకున్నాయి. దాదాపు కోటీ పది లక్షలకు పైగా జనాభా వుండగా, జనవరి 23 నుంచి అమలులోకి వచ్చిన లాక్ డౌన్ ను ఇప్పుడు పూర్తిగా తొలగించారు.

 

ప్రతి ఒక్కరూ తమ సన్నిహితులు, బంధువులు, తోటి ఉద్యోగులను కలుసుకుంటున్నారు. భావోద్వేగంతో కూడిన కన్నీటితో, కరోనాను జయించామని నినాదాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎడారిలా కనిపించిన సిటీ స్ట్రీట్స్, ఇప్పుడు ప్రజల సందడితో కళకళ్లాడుతున్నాయి. మరి ప్రపంచం అంతా ఇలాంటి మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: