దేశంలో ప్రబలి పోతున్న కరోనాని కట్టడి చేసే నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 453 పాజిటివ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, 11 మంది మృతి చెందారని తెలిపారు. తెలంగాణలో కరోనా పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించిన విషయం తెలిసిందే.  కరోనా భయం రాష్ట్రంలో 95 శాతం తగ్గిందన్నారు.

 

ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్న మంత్రి.. వారిని కలిసిన 3,158 మందిని గుర్తించి 167 క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు వివరించారు.  ఇంకా 535 మందికి సంబంధించిన టెస్ట్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. 397 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, వారంతా ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 49 పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.  

 

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో కొత్తగా 8 కరోనా పాజిటీవ్  కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా లో ఈ 8 కేసులు నమోదు అయినట్టు ఆ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.  ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 47 కి చేరిందని అన్నారు.  తెలంగాణలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 461 కి చేరింది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: