కరుణా కారణంగా మార్చి నెలలో మరియు  ఏప్రిల్ నెలలో జరగవలసిన  ఎన్నో ఇంటర్నేషనల్ గేమ్స్ రద్దు అయిన విషయం తెలిసిందే.  అందులో భాగంగానే ఈ ఏడాది జూన్లో జరగవలసిన వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ రద్దు చేయడం జరిగింది .అయితే  వింబుల్డన్  నిర్వాహకులకు ఇన్సూరెన్స్.. భారీ నష్టాల నుంచి గట్టెక్కింది అవును మీరు విన్నది నిజమే. వింబుల్డన్ నిర్వాహకులకు  టోర్నీ  జరగక పోయినప్పటికీ భీమా సౌకర్యం ఉండటం వల్ల వింబుల్డన్ నిర్వాహకులు 141 మిలియన్ డాలర్ల సొమ్మును పొందే అవకాశం ఉంది.  వాస్తవానికి ఈ వింబుల్డన్ టోర్నీ జరిగితే 250 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేది. అయినప్పటికీ కరోనా కారణంగా కొద్ది మొత్తంలో దీని ద్వారా నష్టం భర్తీ అవుతుంది .

 కరుణా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని క్రిడాలు రద్దు అవ్వడం లేక వాయిదా పడటం జరుగుతుంది. టోక్యో ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇకపోతే వింబుల్డన్ గత 17 ఏళ్లుగా టోర్నీని నిర్వహిస్తున్నా మొదటిసారిగా ఈ  పోటీలు వాయిదా పడడం జరిగింది.  ఇక వింబుల్డన్ ఇన్సూరెన్స్ వ్యవహారంతో ఐపీఎల్ భీమా విషయం కూడా చర్చనీయాంశం అయ్యింది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ టోర్నీ  కరోనా కారణంగా   ఏప్రిల్ 15 కు వాయిదా పడడం జరిగింది. ఈ క్రమంలో ఐపీఎల్ రద్దయితే   భీమా అందుతుందా అనే చర్చ ఊపందుకుంది. విపత్తులు విషయంలో భీమా చేయించాలనే చర్చ జరిగిన బోర్డు అంత  సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: