తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ త‌న ప్ర‌తాపం చూపుతోంది. కొంత‌మేర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టే క‌నిపిస్తున్నా.. అనూహ్యంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు మ‌రింత ప‌క‌డ్బందీ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల మ‌ధ్య పాజిటివ్ కేసుల సంఖ్య న‌మోదులో కొద్దిపాటి తేడా మాత్ర‌మే ఉంది. ప్ర‌భుత్వాలు విడుద‌ల చేసిన బులెటిన్ల ప్ర‌కారం.. గురువారం రాత్రి వ‌ర‌కు పీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.  తెలంగాణలో గురువారం రాత్రి వ‌ర‌కు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ఇప్పటివరకు 45 మంది ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 12 మంది మృతి చెందారు. శుక్ర‌వారం 60 మంది బాధితులు డిశ్చార్జ్ కాబోతున్నారు. ఇది చాలా ఆశాజ‌నమైన విష‌య‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కాస్త భిన్న‌మైన ప‌ద్ధ‌తిలో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఓ వైపు ప్ర‌జ‌ల్లో ఆత్మ‌స్థైర్యం నింపుతూనే. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా పేషెంట్ల‌కు నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 58 ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను కూడా ప్ర‌భుత్వ ఆధీనంలోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌త్యేక ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్ప‌టికే సుమారు 15 కంటైన్మెంట్ జోన్ల‌ను గుర్తించి, అక్క‌డి ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు అధికారులు. వారికి అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అధికారులే స‌ర‌ఫరా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: