త‌మిళ‌నాడులో క‌రోనా క‌ల‌కలం రేపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఇటీవ‌ల పాజిటివ్‌ కేసులు త‌గ్గుతున్నాయని కాస్త ఊరట చెందేలోపే రెండు రోజులుగా మళ్లీ కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 834కి చేరింది. ఇప్పటి వరకు 27 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, ఎనిమిది మంది చ‌నిపోయారు. ఇక కొత్తగా నమోదైన 96 కేసుల్లో 84 మంది ఢిల్లీకి వెళ్లివ‌చ్చిన వారే,  వారితో కాం టాక్ట్‌తో ఉన్న వారివే కావ‌డం గ‌మ‌నార్హం.

 

తాజాగా చెన్నైలో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59,918 మంది హోమం క్వారంటైన్‌లో ఉండ‌గా, 211 మంది ప్రభుత్వ వైద్య పర్యవేక్షణలో ఉన్నారని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్రకటించింది.  32,796 మంది హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 7,267 నమూనాలు పరీక్షించామని, గురువారం కొత్త 96 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.  శుక్రవారం నుంచి ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించబోతున్నామని అధికారులు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: