దేశంలో కరోనాని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలు అవుతుంది.  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ మహమ్మారిని ప్రారదోలేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. తాజాగా ఏపిలో కరోనా నియంత్రణ కోసం పరీక్షలు చేయడానికి ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఏపీలో తయారు చేసిన విషయం తెలిసిందే. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అభివృద్ధి చేశారు.  ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సత్వర చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెయ్యికిట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా 50 నిమిషాల్లోనే టెస్టింగ్‌ రిపోర్టు తెలుసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా.. ఏపీ సీఎం జగన్‌ ఏపీలో తయారైన కిట్ల వినియోగాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి భయం పెరిగిపోతోన్న నేపథ్యంలో ప్రజలకు  ఇది భారీ ఉపశమనం కలిగేంచే విషయం. 

 

మే మొదటి వారంలోలోపు ఏపీలో మొత్తం 25,000 కిట్లను తయారు చేస్తారు అని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సర్వే చేసి కరోనా లక్షణాలతో ఉన్న దాదాపు 5,000 మందిని గుర్తించింది. వారిలో దాదాపు 2,000 మందికి పరీక్షలు అవసరమని గుర్తించిన అధికారులు మొదట వారికే పరీక్షలు చేయనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: