కరోనా వైర‌స్‌పై పోరాడుతున్న భార‌త‌ ప్రభుత్వానికి ఆసియా అభివృద్ది బ్యాంకు అండ‌గా నిలిచింది.  తక్షన సాయంగా ఏడీబీ రూ. 16,820 కోట్లు (2.2 బిలియన్‌ డాలర్లు) ప్రకటించింది. ఈ మేరకు ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసాకవ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌కు ఎంతో భ‌రోసా ఇచ్చారు. * ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఏడీబీ భారత్‌కు అండ‌గా ఉంటుంది. ఇందులో భాగంగా క‌రోనా పేషెంట్ల కోసం వైద్య‌ రంగానికి తక్షణమే 2.2బిలియన్‌ డాలర్లు అందిస్తాం. ఇది పేదలు, అసంఘటితరంగ కార్మికులు, చిన్న మధ్య తరహా పరిశ్రలమలు, ఆర్థిక రంగంపై కరోనా మహమ్మారి ఆర్థికంగా ప్రభావం తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది* అని ఆయన అన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాపించ‌కుండా లాక్‌డౌన్‌,  దీనివల్ల ప్రజలపై భారం పడకుండా ఆర్థిక ప్యాకేజిని భార‌త ప్ర‌భుత్వంపై ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు.  

 

నిజానికి.. క‌రోనాపై భార‌త్ అసామ‌న్యా పోరు చేస్తోంద‌ని, ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటోంద‌ని ఇప్ప‌టికే అనేక దేశాలు ప్ర‌ముఖ‌లు ప్ర‌శంసిస్తున్నారు. అంతేగాకుండా.. క‌ష్ట‌కాలంలో అనేక దేశాల‌కు హైడ్రాక్లోరోక్విన్ మందును అంద‌జేస్తుండ‌డంపై కూడా ప్ర‌పంచ దేశాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త్‌కు ఇప్ప‌టికే అమెరికా కూడా ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. అలాగే.. దేశంలో పెద్ద‌పెద్ద కంపెనీల ప్ర‌తినిధులు కూడా భారీ మొత్తంగా విరాళాలు అందిస్తున్నారు. ఇలా ఇప్ప‌టికే వేల‌కోట్ల డ‌బ్బులు కేంద్ర ప్ర‌భుత్వానికి స‌మాకూరుతున్నాయి. పీఎం కేర్స్ ఫండ్‌కు అన్నిరంగాల ప్ర‌ముఖులు కూడా విరాళాలు అంద‌జేస్తున్నారు. క‌ష్ట‌కాలంలో అంద‌రం క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ్లాల‌ని, ప్ర‌భుత్వానికి అండ‌గా ఉండాల‌ని ఇప్ప‌టికే సెల‌బ్రెటీలు పిలుపునిస్తున్నారు. దీంతో సామాన్యులు కూడా విరాళాలు అంద‌జేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: