దేశంలో క‌రోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ అమ‌లుతో ప్ర‌భుత్వాలు క‌రోనాను సాధ్య‌మైన మేర‌కు క‌ట్ట‌డి చేయ‌గ‌ల‌గాలి. ప్ర‌జ‌లంతా ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌తతోపాటు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించాల‌ని కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నాయి.  ప్రతి ఒక్క‌రూ ఇంటికే ప‌రిమితం కావాల‌ని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో  బ‌య‌ట‌కు వ‌స్తే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నాయి.
  
అంతేగాక కరోనా వైరస్‌ను అరికట్టడానికి మాస్కులు ధరించాల్సిందేనని ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే బయట మాస్కుల కొరత ఉన్న కారణంగా ఇంట్లో ఉన్న బట్టలతోనే మాస్కులు తయారు చేసి ధరించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.  ఈ విషయాన్ని ఇన్‌స్టా గ్రామ్ ద్వారా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మాస్కులు కుడుతూ లైవ్ ఇచ్చారు. ‘‘ఇంట్లో కూర్చొని మాస్కులు తయారు చేయండి. మీ దగ్గర కుట్టు మిషన్ లేకపోతే బాధపడకండి.... సూదులతోనైనా కుట్టువచ్చు’’ అంటూ సూదులతో మాస్కులను కుడుతున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: