తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి  రాష్ట్ర ప్ర‌భుత్వం కఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఓ ప‌క్క లాక్‌డౌన్ ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తూనే, మ‌రో ప‌క్క పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న ప్రాంతాల‌ను గుర్తించి హాట్‌స్పాట్‌గా ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికీ వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసేందుకు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 

తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వాడ‌కాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ  రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు జారీ చేసింది. ఇళ్ల నుంచి ఎవ‌రు బ‌య‌టికి వ‌చ్చినా ఇక త‌ప్ప‌కుండా మాస్కులు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోయినా , పాజిటివ్ వ‌చ్చిన ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్న‌ నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని పేర్కొంది.  కాగా  కరోనా క‌ట్ట‌డికి మాస్కులు ధ‌రించ‌డాన్ని  త‌ప్ప‌నిస‌రి చేస్తూ, ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: