ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  దాంతో బయటకు ఎవరు వెళ్లినా లాక్ డౌన్ ఉల్లంఘన అంటున్నారు.  ఈ నేపథ్యంలో కొంత మంది ఇంట్లో ఉంటూ తమకు తోచిన పరిజ్ఞానంతో ఇంట్లో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు.  ముఖ్యంగా మహిళలు వంటలు, కుట్లు , అల్లికల్లో బిజీగా ఉంటున్నారు.  తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆసక్తికర విషయం వెల్లడించారు.  ప్రస్తుతం కరోనాని అరికట్టే మార్గాల్లో ఒకటి ముఖానికి మాస్క్ పెట్టుకోవడం. చేతులు శుభ్రంగా కడగడం.. శానిటైజర్లు వాడటం అని తెలిసిందే.

 

అయితే తమ సతీమణి  కావ్య ఇంట్లో తీరిక సమయాల్లో కరోనా మాస్కులు తయారుచేస్తోందని తెలిపారు. అందరికీ మాస్కులు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆమె మాస్కుల తయారీ చేపట్టిందని వివరించారు. ఇంట్లో మాస్కులు తయారు చేసి అవసరం ఉన్నవారికి అందజేస్తున్నామని.. ఇది ఎంతో మందికి మేలు చేస్తుందని అన్నారు.  ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన కరోనా వ్యాప్తిని చాలా వరకు కట్టడి అయ్యేలా చేశారని.. భారత ప్రధాని నిర్వహిస్తున్న పనులు..  ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. 

 

అంతే కాదు ఆయనను ఎంతో మంది ప్రశంసిస్తున్నారని అన్నారు.  ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి కుటుంబం ముందకొచ్చి మాస్కుల తయారీలో పాలుపంచుకోవాలని సూచించారు. అంతేకాదు, తన భార్య కావ్య మాస్కులు తయారు చేస్తున్న ఫొటోలను కూడా ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: