క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి ఆర్డ‌ర్‌పై బిస్లెరీ వాట‌ర్ బాటిళ్ల‌ను హోం డెలివ‌రీ చేయనుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో బిస్లెరీ వాట‌ర్ కు డిమాండ్ విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో కంపెనీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అంజనా ఘోష్ తెలిపారు. వినియోగ‌దారుల‌కు స్వ‌చ్ఛ‌మైన తాగునీటి అందించేందుకే హోం డెలివ‌రీని ప్రారంభించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే.. ప్ర‌స్తుతానికి ఈ సేవ‌ల‌ను నగరాల్లోని వినియోగదారులు వినియోగించుకోవ‌చ్చు. నేరుగా కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఆర్డర్ చేయ‌వ‌చ్చున‌ని తెలిపారు. 

 

వినియోగ‌దారులు ఆర్డ‌ర్ ఇచ్చిన 48 గంటల్లోపు వాట‌ర్ బాటిళ్ల‌ను పంపిణీ చేస్తామ‌ని కంపెనీ పేర్కొంది. క‌రోనా క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయార‌ని, ఇలాంటి స‌మ‌యంలో ఆరోగ్యం కోసం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని అన్నారు. ఇలాంటి స‌మ‌యంలో ప‌రీక్ష‌ల‌కు అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. వ్యాధులతో పోరాడ‌డానికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎంతో అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. * మెరుగైన పారిశుధ్యం, పరిశుభ్రత పద్ధతులు, పరిశుభ్రమైన నీటిని తీసుకోవడం వల్ల ఏదైనా ప్రజారోగ్య సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు. ఇందుకు  మేము కూడా సిద్ధంగా ఉన్నాం* అని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో విన‌యోగ‌దారులు కూడా సుర‌క్షిత‌మైన మిన‌ర‌ల్ వాట‌ర్‌ను ఎంచుకోవాల‌ని, చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: