ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌తో వ్య‌వ‌స్థ‌లే నాశ‌నం అయిపోయాయి. అమెరికా నుంచి మ‌హామ‌హా అగ్ర దేశాలే చేతులు ఎత్తేస్తోన్న ప‌రిస్థితి. ఒక్క అమెరికాలో గ‌త 24 గంట‌ల్లో ఏకంగా 2500 మంది చ‌నిపోయారంటే క‌రోనా తీవ్ర‌త ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే క‌రోనా దెబ్బ‌తో ఎక్క‌డ ఉన్న‌వి అక్క‌డే ఆగిపోతున్నాయి. ఇక మ‌న‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఐపీఎల్ కూడా ఆగిపోయింది. ఐపీఎల్ ఆగిపోవ‌డం వ‌ల్ల ఇప్పుడు మొత్తం రు. 5 వేల కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదిలా ఉంటే క‌రోనా దెబ్బ‌తో జ‌పాన్‌లో ఈ యేడాది జ‌రిగే ఒలింపిక్స్ కూడా ఆగిపోయాయి.

 

జ‌పాన్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ యేడాది ఒలింపిక్స్ జ‌ర‌పాల‌ని ప‌ట్టుబ‌ట్టినా మిగిలిన దేశాలు వార్నింగ్ ఇవ్వ‌డంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. అయితే ఇప్పుడు జ‌పాన్‌లో కూడా వైర‌స్ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ 5530 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 99 మంది మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో ఈ యేడాది కాకుండా వ‌చ్చే యేడాది అయిన 2021లో కూడా జ‌పాన్‌లో ఒలింపిక్స్ నిర్వ‌హించ‌డం క‌ష్ట‌మే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: