క‌రోనా.. క‌రోనా.. కరోనా.. ఎవ‌రి నోట విన్నా ఇదే మాట‌! కేసుల సంఖ్య త‌గ్గిందా.. పెరిగిందా..?  లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటి..?  ఇలా మ‌న దిన దిర్య మొత్తం క‌రోనా చుట్టే తిరుగుతుంది.. అయినా లాక్‌డౌన్ నేపథ్యంలో దిన‌చ‌ర్య ఎక్క‌డ ఉంటుంది.. అంతా దిన‌దిన‌గండంగానే గ‌డుపుతున్నాం క‌దా..! స‌రేగానీ.. క‌రోనా..కంటికి క‌నిపించ‌ని శ‌త్రువు. ఈ ప్ర‌పంచాన్ని ఊపిరితీసుకోనివ్వ‌కుండా చేస్తున్న వైర‌స్‌..! ఆ వైర‌స్ రూపం ఎలా ఉంటుందో మ‌నకు తెలుసుగానీ.. అది మ‌న క‌ణాల్లోకి ఎలా చొర‌బ‌డుతుంది.. చొర‌బ‌డిన త‌ర్వాత ఏం చేస్తుంది..? మ‌న ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ‌తీస్తుంద‌న్న‌ది మాత్రం తెలియ‌దు. ఇదే విష‌యంపై బ్రెజిల్‌కు చెందిన ప‌లువురు ప‌రిశోధ‌కులు ప‌రిశోధించారు. ఈ వైర‌స్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఈ ప్ర‌పంచానికి అందించారు. అవేమిటో చూద్దామా.. 

 

 బ్రెజిల్‌లోని ఒస్వాల్డో క్రూజ్‌ ఫౌండేషన్‌ కు చెందిన నిపుణులు పరిశోధనలు జరిపారు.  ప్రపంచంలోనే తొలిసారిగా అత్య‌ధిక‌ తీక్షణత కలిగన‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ సాయంతో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఫొటోలు తీశారు. ఈ మైక్రోస్కోప్‌ సాయంతో ఏదైనా కణాన్ని ఉన్న పరిమాణం కన్నా దాదాపు 20 లక్షల రెట్లు పెద్దగా చూడొచ్చున‌ట‌. శరీరంలోకి వెళ్లిన వైరస్‌ కణాలు మొట్టమొదటగా.. మ‌న‌ కణ త్వచాన్ని టార్గెట్‌గా చేసుకుని క‌దులుతాయి. ఆ త‌ర్వాత‌ కణ త్వచం గుండా కణంలోకి ప్రవేశిస్తుంది. కణంలోకి ఇలా ప్ర‌వేశించ‌గానే.. కణంలోని కేంద్రక త్వచం వద్దకు వేగంగా చేరుకుంటుంది. అంటే ఈ సమయంలోనే మనం ఈ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడతాం. ఆ తర్వాత కణంలో ఉన్న కణ ద్రవ్యంలో వైరస్‌ వృద్ధి చెందడం మొద‌ల‌వుతుంది. ఈ కణ ద్రవ్యంలోనే వైరస్‌ తన జన్యువులను అభివృద్ధి చేసుకుంటూ.. వేరే కణాలకు సోకుతూ వెళ్తోంది. ఇలా రోజులు గ‌డిచే కొద్దీ ఈ వైర‌స్ ప్ర‌భావం పెరుగుతూ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: