కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా లక్షణాలతో ఓ నేపాలీ వృద్ధుడు  గాంధీ హాస్పిటల్ కి వెళ్లగా గాంధీ హాస్పిటల్ లో అక్కడ బెడ్స్ ఖాళీగాలేవని కింగ్ కోటి కి హాస్పిటల్ కి వెళ్ళమని సూచించారు . చేసేది ఏమిలేక అతను కాలినడకన కింగ్ కోటి హాస్పిటల్ కి వెళ్ళాడు అక్కడ ఆ నేపాలీ వృద్దుడికి కరోనా లక్షణాలు ఉన్నాయని గ్రహించి హాస్పిటల్ లో చేర్చుకోవడానికి నిరాకరించారు.

 

వారు తిరిగి గాంధీ హాస్పిటల్ కు వెళ్ళవలసిందిగా సూచించారు .
క్రమంలో అంబులెన్స్ కోసం ఎంత సేపు నిరీక్షించిన రాకపోవడంతో మళ్లీ కాలినడకన వృధుడు గాంధీ హాస్పిటల్ కి ప్రయాణం అయ్యాడు . మార్గమధ్యంలో వృద్ధుడు కుప్పకూలి చనిపోయాడు. అతడు రాత్రంతా చనిపోయిన స్థితిలో రోడ్డుపైనే ఉన్నాడు . తెల్లవారు జామున అటుగావెళ్తున్న ఓ వ్యక్తి పోలీసులకు విషయాన్నీ తెలియజేసాడు. అయితే  నేపాల్‌కు చెందిన 70 ఏళ్ల బహదూర్ లాలాపేటలోని ఓ బార్‌లో పని చేసేవాడు. జలుబు దగ్గు ఉన్నకారణంగా లోకల్ డాక్టర్స్ కరోనా లక్షణాలు అయ్యి ఉండొచ్చు అని చెప్పి గాంధీ హాస్పిటల్కు వెళ్ళవలసినది గా సూచించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: