దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసుల గురించి లాక్ డౌన్ ఎత్తివెతపై నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో  ప్రధాని వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతున్నారు. . కరోనా నివారణ చర్యలు, రాష్ర్టాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోడీ సమీక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించే విషయంపై మోడీ కీలకంగా చర్చిస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకుంటున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పంజాబ్ లో మే 1 వరకు, ఒడిషాలో 31 వరకు  లాక్ డౌన్ ని పెంచుతున్నట్లు తెలిపారు. 

 

ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలని చూస్తున్నారు.  మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే అంశం పై మాట్లాడుతూ.. లాక్ డౌన్ ని మరిన్ని రోజులు పెంచితే ఈ ప్రభావం దాదాపు అరికట్టవొచ్చు అని అన్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో ఏకంగా 1,035 కేసులు నమోదయ్యాయి.

 

24 గంటల్లో దేశంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 6,565 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. 643 మంది కోలుకున్నారు. 239 మంది ప్రాణాలు కోల్పోయారు.  రాజస్థాన్‌లో 553 మందికి కరోనా సోకగా, తెలంగాణలో 473 మందికి సోకింది. ఉత్తరప్రదేశ్‌లో 431 మంది, హర్యానాలో 177 మందికి కరోనా సోకింది. కేరళలో 364 మంది కరోనా బాధితులున్నారు. లఢక్‌లో 15 మంది, జమ్మూకశ్మీర్‌లో 207 మందికి కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: