తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. మెద‌క్ జిల్లా పాప‌న్నపేట మండ‌లంలోని నాగ్సాన్‌ప‌ల్లికి చెందిన 27 ఏళ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. సంగారెడ్డికి చెందిన క‌రోనా వ‌చ్చిన వ్య‌క్తి ఇటీవ‌ల  నాగ్సాన్‌ప‌ల్లికి రాగా, అత‌డితో స‌న్నిహితంగా ఉన్న తొమ్మిది మందిని క్వారంటైన్‌కు త‌ర‌లించారు.

 

వారి శాంపిళ్ల‌ను పరిశీలించ‌గా, అందులో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. దీంతో అత‌డిని సికింద్రాబాద్‌లోని గాంధీ ద‌వాఖాన‌కు త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 487 గా ఉన్న క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 488కు  చేరింద‌ని అధికారులు పేర్కొన్నారు. శుక్ర‌వారం కొత్త‌గా 16 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా,  గ‌త రెండు రోజులుగా త‌క్కువ పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టం కాస్త ఊర‌ట క‌లిగిస్తోంద‌ని వైద్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సిరిసిల్ల‌లో తొలి పాజిటిక్ కేసు నమోదుకాగా, రాష్ట్రంలోని 27 జిల్లాల్లోనూ క‌రోనా వ్యాపించిన‌ట్ల‌యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: