అన్ని రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోడీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ ముగిసింది. ఈ స‌మావేశంలో దేశంలో కొన‌సాగుతున్న లాక్‌డైన్‌ను ఏప్రిల్ 14వ త‌ర్వాత పొడిగించాలా.. వ‌ద్దా.. అన్న అంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. ముఖ్య‌మంత్రుల అభిప్రాయాలు తెలుసుకుని, వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్న త‌ర్వాత మోడీ మాట్లాడారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు భ‌రోసా ఇచ్చారు. తాను 24గంట‌లూ అందుబాటులో ఉంటాన‌ని, అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందిస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అంద‌రం ఐక్యంగా ఉంది, క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వీడియ‌లో కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌ధాని మోడీతోపాటు ముఖ్య‌మంత్రులు మాస్క్‌ల‌ను ధ‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రులు మాట్లాడుతూ క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని ప్ర‌ధానిని కోరిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వైర‌స్‌క‌ట్ట‌డికి కేంద్రం నుంచి నిత్యం స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని ప‌లువురు కాంగ్రెస్ పాలిత‌ ముఖ్య‌మంత్రులు కోరిన‌ట్లు స‌మాచారం.

 

  వ్య‌వ‌సాయ, పారిశ్రామిక రంగాల‌కు ఆర్థిక స‌హ‌కారం అందించాల‌ని కోరారు. దేశ‌వ్యాప్తంగా ఒకే విధంగా లాక్‌డౌన్‌ను అమ‌లు చేయాల‌ని ప‌లువురు ముఖ్య‌మంత్రులు కోరారు. రెడ్‌జోన్ల‌లో మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్‌ను అమ‌లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ముఖ్య‌మంత్రుల‌ను కోరారు. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌పై మోడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని దేశ ప్ర‌జ‌లంద‌రూ ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఈరోజు రాత్రి లేదా.. ఆదివారం ఉద‌యం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరుకుంది. ఇక మ‌ర‌ణాల సంఖ్య 239కు చేరుకుంది. అయితే..24 గంట‌ల్లో 1035 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 40  మంది మృతి మృతి చెందారు. ఆస్ప‌త్రుల్లో 6656 మంది చికిత్స పొందుతున్నారు. 643మంది కోలుకున్నారు. అయితే.. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. దేశంలో మొత్తం 720 జిల్లాలు ఉన్నా.. దాదాపుగా 400 జిల్లాలో క‌రోనా వైర‌స్‌ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.  ఇదే స‌మ‌యంలో దేశంలోని 133 జిల్లాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలో మోడీ నిర్ణ‌యం కోసం దేశ ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: